Hyderabad, జూన్ 28 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంటికెళ్లి మరి యామిని చెంప పగులకొడుతుంది అప్పు. నువ్ చేసిన పనికి చంపిన తప్పులేదంటుంది. స్వప్న అక్కను కిడ్నాప్ చేసి కావ్య అక్కని బెదిరించిన విషయం నాకు తెలియదనుకుంటున్నావా. ఇంకోసారి మా అక్కల జోలికి వచ్చావనుకో తుక్కురేగొడతాను. నేను ఊర మాస్. మా అక్కల జోలికి వస్తే నిన్ను నిలువునా చీరేస్తాను అని అప్పు వార్నింగ్ ఇస్తుంది.

కానీ, దానికి యామిని నవ్వుతుంది. నువ్ చెప్పేది కామెడీగా ఉంది. నీకు అంత సీన్ లేదు. పెళ్లిలో సాక్ష్యం ఉన్న ఏం చేయలేకపోయావ్ అని యామిని అంటుంది. హలో అమూల్ బేబీ ఆరోజు నిన్ను అరెస్ట్ చేయకుండా ఉంది సాక్ష్యం లేనందుకు కాదు. మా అక్క వద్దన్నందుకు. ఎలాగు పెళ్లి ఆగిపోయింది కదా అని అరెస్ట్ ఎందుకు అని జాలీపడి వదిలేశా అని అప్పు అంటుంది.

దాంతో యామిని బిత్తరపోతుంది. పోయిన సాక్ష్యాన్ని ...