Hyderabad, జూన్ 27 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య కోసం అప్పు వెళ్తుండగా.. కళావతి గురించి రాజ్ అడుగుతాడు. తనకోసమే వెళ్తున్నా. కానీ, చెప్పలేను అని మనసులో అనుకుంటుంది అప్పు. అక్కేం కాల్ చేయలేదని అప్పు చెప్పి వెళ్లిపోతుంది. కళావతి గారు ఎక్కడున్నారు. ఎప్పుడు వస్తారు అని రాజ్ అనుకుంటాడు. రాజ్‌ను కావ్యకు కాల్ చేయమని ఇందిరాదేవి వాళ్లు అంటారు.

మళ్లీ డిస్టర్బ్ చేయలేను. తను మంచి మనసుకి, మంచి మాటకు ఎవరైన మంత్రముగ్ధులు అయిపోవాల్సిందే. కళావతి గారు విరబూసిన రోజా పూవు. నేను చాలా అదృష్టవంతుడిని అని రాజ్ గొప్పగా చెబుతాడు. ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్తాను అని రాజ్ అంటాడు. ఇంకో గంట ఆగితే కళావతి వస్తుందని అపర్ణ చెబుతుంది. ఇలాంటి టెన్షన్‌లో లవ్ ప్రపోజ్ చేయడం ఎందుకు రేపో, ఎల్లుండో చెబుతాను అని రాజ్ వెళ్లిపోతాడు.

మొత్తానికి యామిని మొదటి మెట్ట...