Hyderabad, జూన్ 26 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్న కారుకు ఉన్న జీపీఎస్ ట్రాకర్‌ మూలంగా కావ్య ఫాలో అవుతుంది. ఇంతలో రాజ్ కాల్ చేసి నన్ను ఇన్సల్ట్ చేశారు. ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూసుకోవాలి. అలా వెళ్లిపోయారు. ఇంకా రాలేదు అని రాజ్ అంటాడు. నేను ఇప్పుడే రాలేను అని కావ్య అంటే ఏంటీ అంత కంగారుపడుతున్నారు. నా హెల్ప్ కావాల అని రాజ్ అంటాడు.

అదేం వద్దని ఇంటికి వచ్చాక మాట్లాడుతానని కావ్య కాల్ కట్ చేస్తుంది. రాజ్ కాల్ మాట్లాడటం విన్న ఇందిరాదేవి, అపర్ణ వచ్చి ఏం చెప్పిందని అడిగితే.. ఏదో సమస్యలో ఉన్నట్లుంది. తర్వాత చేస్తా అని కాల్ కట్ చేసినట్లు చెబుతాడు రాజ్. దానికి ప్రాబ్లమ్స్ లేనిది ఎప్పుడు అని ఇందిరాదేవి అంటుంది. మరోవైపు స్వప్న కారు దొరుకుతుంది. కానీ, అందులో స్వప్న ఉండదు. ఆ రౌడీలు ఏమైనా చేశారా అని కావ్య టెన్షన్ పడుతుంది.

కట్ చేస్తే స...