Hyderabad, జూన్ 24 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌తో పెళ్లి ఆగిపోవడంతో లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది యామిని. దాంతో రాజ్‌ను వైదేహి నిందిస్తూ తిడుతుంది. యామినిని మోసం చేస్తున్నట్లు అనిపించింది. అందుకే పెళ్లి వద్దనుకున్నాను అని రాజ్ అంటాడు. ఇంతలో యామిని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుంది.

నిజంగానే చనిపోవాలనే అనుకున్నా. కానీ, బావ సైడ్ నుంచి ఆలోచించా. బావకు ఈ పెళ్లి అంటేనే ఇష్టం లేదు. కేవలం నాకు ఏమవుతుందో అనే భయంతోనే పెళ్లి ఒప్పుకున్నాడు. బావ మనసులో ఇంకెవరో ఉన్నారు. నాకు కావాల్సింది నీ జాలి కాదు. నీ ప్రేమ. నీ మనసులో ఇంకొకరు ఉంటే నేనెందుకు పెళ్లి చేసుకుంటా. లైఫ్ లాంగ్ బాధపడటం కంటే దూరమవడమే మంచిది అని యామిని అంటుంది.

నీకు ఎవరు ఇష్టమో వాళ్లనే పెళ్లి చేసుకో అని యామిని అంటుంది. సారీ యామిని ఒక రకంగా అంతమంది ముందు అవమానిం...