Hyderabad, జూన్ 23 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఏంటీ అప్పు నువ్ చెప్పింది నిరూపించుకోలేకపోయావ్. ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావ్ అని అప్పును అడుగుతాడు రాజ్. మీకు ఇంకా అర్థం కాలేదా అల్లుడు గారు. చేయని తప్పుకు నా కూతురుని ఇరికించి పెళ్లి ఆపించాలని చూసింది ఈ అప్పు అని వైదేహి అంటుంది.

అప్పు గారి మీద నిందలు వేయకండి అని కానిస్టేబుల్ అంటాడు. వీడు చెప్పినదానికి సరైన సాక్ష్యం లేకుండా తీసుకురావడం మనదే తప్పు. వాడిని తీసుకెళ్లండి అని అప్పు అంటుంది. చాలా బాగా నటిస్తున్నారు. మీ ఫ్యామిలీ మీదే అనుమానం కలుగుతోంది. ఈ పెళ్లికి ఆటంకాలన్నీ మీరే చేస్తున్నట్లున్నారు అని వైదేహి అంటుంది. మీకేం ద్రోహం చేశాం అని యామిని ఏడుస్తూ నటిస్తూ అంటుంది.

పర్ఫామెన్స్ ఇరగదీస్తుందిగా. దెబ్బకు రాజ్ పెళ్లి చేసుకోవడం ఖాయం అని రుద్రాణి అంటుంది. యామిని చేసే ఓవరాక్షన్ తట్టుక...