Hyderabad, జూన్ 21 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పెళ్లి ఆపడం లేదా అని రుద్రాణి నువ్వెందుకు ఆపడం లేదు అని ఇందిరాదేవి అంటుంది. అంత బలగం ఉంటే నా కొడుకును ఎప్పుడో ప్రయోజకుడిని చేసేదాన్ని అని రుద్రాణి అంటుంది. కావ్య ఏంటీ సైలెంట్‌గా ఎందుకు ఉంది. నీ మొగుడికే పెళ్లి జరుగుతుందని తెలుసా అని రుద్రాణి అంటుంది.

నేను పెళ్లి ఆపడం లేదు. కానీ, ఈ పెళ్లి జరగదు అని కావ్య అంటుంది. ఏంటీ అదెలా అని రుద్రాణి అంటుంది. అయిపోయింది. రుద్రాణి పని అయిపోయింది. ఆ బ్రహ్మముడి పురాణం చెబుతుంది కావ్య అని అపర్ణ అంటుంది. అలాగే, రాహుల్, రుద్రాణికి కావ్య తన బ్రహ్మముడి వల్లే రాజ్ పెళ్లి ఆగిపోతుందని చెబుతూనే ఉంటుంది. రుద్రాణి తిక్క బాగా కుదిరింది అని అపర్ణ అంటుంది.

అప్పు, కల్యాణ్ పోలీసుల కోసం ఎదురుచూస్తుంటారు. కానిస్టేబుల్‌ శేష్‌కు కాల్ చేసి త్వరగా రమ్మని అప్పు చెబుతు...