Hyderabad, జూన్ 20 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇష్టమైన వ్యక్తి దూరంగా వెళ్తుంటే ఇంత బాధగా ఉంటుందని తెలియదు అని కావ్యకు చెబుతాడు రాజ్. దాంతో కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీకు నాలాగే ఉంది కదూ. లోలోపల బాధ ఉన్నా పైకి నటిస్తున్నారుగా. నిజమేంటో చెప్పండి అని రాజ్ అంటాడు.

అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా. తెల్లవారితే పెళ్లి. ఇప్పుడు 11 గంటలు. ఈ సమయంలో అమ్మాయిని పిలిచి బాధగా ఉందా అని అడుగుతున్నారు. మీరు పెళ్లి చేసుకుంటే నాకెందుకు బాధగా ఉంటుంది. యామినికి మాటిచ్చింది మీరు. పెళ్లి చేసుకుంటానంది మీరు. నిర్ణయాలన్నీ మీరు తీసుకుని నన్ను ప్రశ్నిస్తున్నారు. మీకు ఏం కావాలో మీకే క్లారిటీ లేనప్పుడు నేనేం చేస్తాను అని కావ్య హిత బోధ చేస్తుంది.

నా లైఫ్‌లో నాకు ఏం కావాలో నాకు క్లారిటీ ఉంది. మీరు మీ మనసుని అడిగి ఓ క్లారిటీ తెచ్చుకోండి. ...