Hyderabad, జూన్ 14 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో దోషం పోవడానికి దుర్గమ్మ పూజకోసం శాస్త్రి పంతులు ఏర్పాట్లు చేస్తుంటాడు. తన శిష్యుడుకి ఏం తెలియదని తిడుతుంటాడు. ఆ శాస్త్రి పంతులును కనకంకు అపర్ణ, ఇందిరాదేవి చూపిస్తారు. ఆ పంతులు నాకెందుకు తెలియదు. వాడికి ఒక వీక్‌నెస్ ఉందమ్మా. మనం దానిమీద దెబ్బకొడితే చచ్చినట్లు మన దారికి వస్తాడు అని కనకం అంటుంది.

ఇంతకీ ఏంటా వీక్‌నెస్ అని అపర్ణ అడుగుతుంది. కనకాంబరం.. తన వీక్‌నెస్ పేరు కనకాంబరం. మీరు తన దగ్గరికి వెళ్లి మీకోసం కనకాంబరం ఎదురుచూస్తుందని గదిలోకి తీసుకురండి. అక్కడ ఆడిద్దాం తనతో కబాడి అని కనకం అంటుంది. అన్నట్లుగానే పంతులుతో మీకోసం కనకాంబరం ఎదురుచూస్తుందని, పైకి వెళ్లండని చెబుతారు అపర్ణ, ఇందిరాదేవి.

చాలా థ్యాంక్స్ అని పంతులు పైకి వెళ్తాడు. ఒసెయ్ కనకాంబరం నువ్వెందుకు వచ్చి చచ్చావే నన్ను ఇరి...