Hyderabad, జూలై 31 -- స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు అంటే జులై 31 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ఎపిసోడ్ కూడా ట్విస్టులతో ఇంట్రెస్టింగా సాగింది. అటు యామినికి షాక్ ఇచ్చిన రాజ్.. ఇటు కావ్యకు ప్రపోజ్ చేయడానికి రెడీ అవుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.

బ్రహ్మముడి సీరియల్ గురువారం (జులై 31) ఎపిసోడ్ కూడా స్వరాజ్ కు అపర్ణ, సుభాష్ లు తినిపించే సీన్ తో మొదలవుతుంది. తిన్న తర్వాత నీళ్లు తాగడానికి కూడా స్వరాజ్ మారాం చేస్తాడు. తనకూ కాళ్లు నొప్పిగా ఉన్నాయంటూ కూర్చొన్న చోటే అతనికి నీళ్లు తాగించి తాను యాక్టింగ్ చేసినట్లు అపర్ణ చెబుతుంది. ఆ తర్వాత తనను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాలనడంతో చేసేది లేక అపర్ణ వాడిని ఎత్తుకొని వెళ్తుంది.

అమ్మని రేవతి కొడుక్కి దగ్గర చేయడంలో తాను సక్సెస్ అయ్యాయని రాజ్ అనడంతో 50 శాతమే అయ్యారని కావ్య అంటుంది. మి...