Hyderabad, జూలై 29 -- బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జులై 29) 786వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఈ ఎపిసోడ్ లో రాజ్, కావ్య వేసిన మరో ప్లాన్ సక్సెసవుతుంది. స్వరాజ్ తన అమ్మమ్మ ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి మంగళవారం (జులై 29) ఎపిసోడ్ రేవతి ఒంటరిగా కూర్చొని బాధపడే సీన్ తో మొదలవుతుంది. తన కొడుకు వచ్చి ఆకలవుతోందంటున్నా పట్టించుకోని పరధ్యానంలో ఉన్న రేవతిని చూసి జగదీశ్ మందలిస్తాడు. ఎందుకలా బాధపడతావ్.. దాని గురించి ఆలోచించకూడదని చెప్పాను కదా అని అంటాడు. అలా అయినా అమ్మను మరోసారి గుర్తు చేసుకుంటాను కదా అంటూ రేవతి అంటుంది.

బాబు కోసం టిఫిన్ చేయడానికి సిద్ధమవుతున్న ఆమెకు రాజ్ ఫోన్ చేస్తాడు. ఇంత పొద్దునే తమ్ముడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడంటూ అతనితో మాట్లాడుతుంది. స్వరాజ్ ను తీసుకొని వెంటనే శివాలయం దగ్గరికి రావాలని రాజ్ అంటాడు. ఎం...