Hyderabad, జూలై 11 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో యామిని ట్రాప్‌లో పడిన అప్పు లంచం తీసుకుంటున్నట్లుగా ఏసీబీకి దొరుకుతుంది. దాంతో పోలీస్ యూనిఫామ్ తీసి బాధగా ఇస్తుంది. ఇదంతా లంచం తీసుకోకముందు ఉండాలి అని ఏసీబీ ఆఫీసర్ అంటాడు.

నిజమనేది బయటపడినప్పుడు ఈ యూనిఫామ్ నా దగ్గరికి వస్తుందని అప్పు అంటుంది. ఎఫ్ఐఆర్ పూర్తి అయిందని కానిస్టేబుల్ శేషు చెబితే ఇంకెందుకు సెల్‌లో పెట్టమని ఆఫీసర్ అంటాడు. దాంతో కానిస్టేబుల్ ఇబ్బందిపడతాడు. దాంతో అప్పునే సెల్‌లోకి వెళ్తుంది. ఇంతలో కావ్య వచ్చి బెయిల్ తీసుకొచ్చినట్లు చెబుతుంది.

లాయర్ బెయిల్ ఇస్తాడు. దాంతో షాక్ అయిన ఆఫీసర్ బెయిల్ ఎలా వచ్చింది. ఇలాంటి కేసులో రాదుగా అని అంటాడు. సమాజంలో మంచి పేరు ఉండి. గతంలో నేర చరిత్ర లేకుంటే బెయిల్ వస్తుందని లాయర్ అంటాడు. అంతగొప్ప బ్యాక్‌గ్రౌండ్ ఉందా అని ఏసీబీ ఆఫీసర్ అంటే నా...