Hyderabad, జూలై 10 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆఫీస్‌లో బోర్డ్ మీటింగ్ జరుగుతుంది. కంపెనీ లాభాల్లో లేదని, మీరు కంపెనీ ఎండీగా తొలగిపోవాలని సిద్ధార్థ్ అంటాడు. ఇప్పటివరకు అంతగా లాభాలు లేకపోవచ్చు. ఇప్పుడు నేను వచ్చానుగా, ఇంకేంటీ అని రాజ్ అంటాడు.

మీ హెల్త్ కండిషన్ సరిగ్గా లేదని ఇంటర్నల్‌గా తెలిసింది. మీకు అసలు కంపెనీలో జరిగిన డీల్స్ గుర్తున్నాయా అని సిద్దార్థ్ అంటే స్వరాజ్ గ్రూప్ కంపెనీ స్టార్ట్ చేసిన తేది నుంచి, రాజ్ ఎండీగా చేపట్టిన రోజుల గురించి రాజ్ చెబుతాడు. అవి సెకండ్ క్లాస్ పిల్లాడు కూడా చెప్పగలడు అని సిద్ధార్థ్ అంటాడు.

దాంతో రాజ్ ఎండీగా ఉన్నప్పుడు పెంచిన లాభాల గురించి, సిద్ధార్థ్ వాళ్ల నాన్న 2018లో బోర్డ్ మెంబర్‌గా ఉన్నప్పుడు చేసిన ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ గురించి చెబుతాడు. దాంతో సిద్ధార్థ్ అవాక్కవుతుడు. ఇల్లీగల్ గోల్డ్...