భారతదేశం, జనవరి 21 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 935వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సీరియల్ లో మరో కీలక మలుపు వచ్చేలా కనిపిస్తోంది. కావ్య మొండి పట్టుదలకు ఇంట్లో వాళ్లకు దిగి వస్తారు. దీంతో రుద్రాణి, మంత్రి ధర్మేంద్ర చిక్కుల్లో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జనవరి 21) ఎపిసోడ్ మంత్రి ధర్మేంద్ర ఇంటికి రుద్రాణి వెళ్లే సీన్ తో మొదలవుతుంది. పాప ఇంటికి రావడంతో ఖుషీగా ఉన్న మంత్రి ఏం కావాలో చెప్పండని రుద్రాణిని అడుగుతాడు. అయితే ముప్పు ఇంకా తొలగిపోలేదని, కావ్య పట్టుదల గురించి చెబుతుంది.

దుగ్గిరాల కుటుంబానికి ఉన్న పరపతి గురించీ హెచ్చరిస్తుంది. అయితే అలాంటి పరిస్థితే వస్తే తన డబ్బు, పవర్ ఉపయోగిస్తానని మంత్రి అంటాడు. పాపను వదిలేయాల్సిన పరిస్థితి వస్తే.. మంత్రి కొత్త కుట్ర చేయడానికి వెనుకాడబోడని ...