Hyderabad, ఆగస్టు 29 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ హాస్పిటల్‌లో ఉంటాడు. అపర్ణ చాలా బాధపడుతుంది. వాడు చావు అంచులో ఉండటానికి తనే కారణం అని, క్షమించమని ప్రాధేయపడుతుంది అపర్ణ. ఇంతలో యామిని వచ్చి చప్పట్లు కొడుతుంది. మీది ఎవరిది తప్పు లేదంటా చేతులు దులుపేసుకుందామనుకుందామనుకుంటున్నారా అంటుంది.

నిజానికి నేను చేసిన సాయానికి నా కాళ్లు కడిగి మీ నెత్తిన పోసుకోవాలి. రాజ్ గతం మర్చిపోయి ఉంటే నేను అండగా నిలిచాను. మీరంతా ప్లాన్స్ వేసుకుని మరి రాజ్‌కు గతం గుర్తుకు తేవాలని ప్రయత్నించి ఇక్కడికి తీసుకొచ్చారు. రాజ్‌కు ఏమైనా జరగాలు మీ ఒక్కొక్కరి సంగతి చెబుతా అని యామిని అంటే కావ్య వెళ్లి ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది.

నన్నే కొడతావా అని యామిని చేయి లేపితే ఆపి ఇంకా మాట్లాడితే ఇక్కడే చంపేస్తాను. నీ బతుకు ఇక్కడ అందిరికి తెలుసు. సిగ్గులేని నువ్వు నాకు...