Hyderabad, ఆగస్టు 28 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు, నువ్ మోసపోయావా లేదా నన్ను మోసం చేశావా. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. జీవితంలో ఏ ప్రశ్న నిన్ను అడగను. నీ మాటకు ఎదురుకూడా చెప్పను అని రాజ్ ఆవేశంగా అంటాడు.

ఇంతలో యామిని వచ్చి చెప్పు కళావతి అంటుంది. మా బావ లాంటి గొప్ప ప్రేమికుడు భవిష్యత్తులో కూడా ఎవరుండరు. ఎవరితోనో కడుపు తెచ్చుకుని మా బావను మోసం చేసిన కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు అంటే తనకు ఎంత గొప్ప మనుసు ఉండాలి. దేవుడే వరమిచ్చినట్లుగా మా బావ గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ నిజం ఎందుకు దాచిపెట్టావో మొత్తం చెప్పు కళావతి అని యామిని అంటుంది.

కావ్య సైలెంట్‌గా ఉంటే.. నిజం చెప్పలేవా. అంటే తప్పు చేశావనేగా అర్థం. మా బావను ఇలా చివరికి తాగుబోతును చేయాలనేగా నీ ...