Hyderabad, ఆగస్టు 25 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అల్లుడి గారెని బయటకు ఎందుకు పంపావ్. అసలే ఇప్పుడు బాగా తాగుతున్నాడు అని యామిని తల్లి అంటుంది. బావను మందుకు బానిస చేసింది నా దారికి తెచ్చుకోడానికే. కావ్య దగ్గర దొరకినది నా దగ్గర దక్కుతుంది అని చూపించడానికి అని యామిని అంటుంది.

ఇంతలో రాజ్‌ను కావ్య తీసుకురావడం చూసి షాక్ అవుతారు. నువ్ ఎంత చేసిన రాజ్ మాత్రం కావ్య దగ్గరికే వెళ్తున్నాడు అని యామిని తల్లి అంటుంది. నేను ఎక్కడికి రాను. రోడ్డు మీదే ఉంటాను అని రాజ్ అంటుంటాడు. ముందు రెస్ట్ తీసుకోండి. తర్వాత ప్రపంచంపై పోరాటం చేయడానికి వెళ్దురు అని కావ్య అంటుంది.

నా ప్రపంచమే నువ్వైనప్పుడు నీతోనే నా పోరాటం కూడా నీతోనే. పద రోడ్డుమీద కొట్టుకుందాం అని రాజ్ అంటాడు. సరే తర్వాత కొట్టుకుందాం అని కావ్య అంటుంది. ఏం చేశావ్ మా బావని అని యామిని ఓవరాక్షన్ చ...