Hyderabad, ఆగస్టు 23 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో రాజ్ బాధపడుతుంటాడు. మరోవైపు కావ్య కూడా ఏడుస్తూ ఉంటుంది. వాళ్లిద్దరు మధ్య జరిగింది ఒకరికొకరు గుర్తు చేసుకుంటారు. మరోవైపు నాకు మాత్రం చాలా రిలాక్స్‌డ్‌గా ఉందని రాహుల్‌తో రుద్రాణి అంటుంది. కానీ, ఇంట్లో వాళ్లు నిన్ను అంటుంటే గిల్టీగా ఉందని రాహుల్ అంటాడు.

దున్నపోతు మీద వాన పడినట్లు దులిపేసుకోవాలని రుద్రాణి అంటుంది. రాజ్ ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రాడు. ఇక ఆస్తిని దక్కించుకోడానికి ప్లాన్ వేయాలి. రాజ్ ఇంటికి రాడు. రాజ్ వస్తే కావ్య కడుపుకు కారణం ఎవరో చెప్పాలి. కావ్య చచ్చిన చెప్పదు. ఇక ఆస్తి మనకే అని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు ఉదయం కావ్య దగ్గరికి ఇందిరాదేవి, అపర్ణ వెళ్తారు.

ఇందులో నీ తప్పేం లేదని ఇద్దరు కావ్యను ఓదార్చుతారు. ఇద్దరు తినమంటారు. నాకు ఆకల...