Hyderabad, ఆగస్టు 26 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 810వ ఎపిసోడ్ రామ్ తాగి వచ్చి దుగ్గిరాల ఇంట్లో గొడవ చేయడం, కళావతిని పెళ్లి చేసుకుంటానని మొండికేయడం, రుద్రాణి షాక్ తినడంలాంటి సీన్లతో సాగిపోయింది. అయితే చివర్లో అపర్ణ ఇచ్చిన ట్విస్టుతో మరో మలుపు తిరిగింది.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఆగస్టు 26) ఎపిసోడ్.. రాజ్ తాగుడుకు బానిస కావడంతో ఇంట్లో వాళ్లందరూ బాధపడుతూ ఉండే సీన్ తో మొదలవుతుంది. వాడిని ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలని అపర్ణ అంటుంది. ఎలా తీసుకొస్తారు రాజ్ ఏమైనా చిన్న పిల్లాడా.. అతనికి ఏం చెబుతారు.. అంటూ రుద్రాణి అడుగుతుంది.

ఇదంతా నీవల్లే, ఆ నిజం చెప్పకపోయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని ఇందిరాదేవి నిందిస్తుంది. నేనేం చేశాను అని రుద్రాణి అంటుంది. అపర్ణ జోక్యం చేసుకుంటూ అవసరమైతే అసలు నిజం చెప్పేస్తానని స్పష్టం చేస్తుంది. దీంతో అక్కడే ఉ...