Hyderabad, అక్టోబర్ 7 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 845వ ఎపిసోడ్ కూడా రాజ్, కావ్య చుట్టే తిరిగింది. అతని నుంచి నిజం రాబట్టడం కోసం కావ్య సహా ఇంట్లో వాళ్లందరూ టార్చర్ పెడతారు. అయినా రాజ్ మాత్రం నోరు విప్పడు. అటు అప్పును అడ్డం పెట్టుకొని ఇంట్లో కొత్త చిచ్చు పెడుతుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ రాజ్ తో కావ్య, అపర్ణ, ఇందిరాదేవి ఆడుకునే సీన్ తో మొదలవుతుంది. రాజ్ తినడానికి కూర్చున్న ఎవరూ వడ్డించరు. ఆ ముగ్గురూ హాల్లోనే ఉన్నా అతన్ని పట్టించుకోరు. తనకు వడ్డించమని అతడు అందరినీ బతిమాలుతాడు.

కానీ ఎవరూ వినరు. దీంతో రాజ్ తానే వడ్డించుకొని తింటాడు. పొలమారినట్లు నటించినా కూడా ఆ ముగ్గురూ ఏమీ పట్టనట్లు ఉంటారు. నాన్నమ్మను పిలిచినా.. నీ పెళ్లాంని పిలుచుకో అంటుంది. ఆ తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి...