Hyderabad, అక్టోబర్ 6 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య దగ్గరికి అప్పు వచ్చి విడాకుల గురించి మాట్లాడుతుంది. ఇంతకాలం బావ కోసమే బతికిన నువ్వు ఇప్పుడు ఎందుకు బావనే వద్దంటున్నావ్. ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావ్. ఇది వంద శాతం కరెక్ట్ కాదు అని అప్పు అంటుంది. మరి మీ బావ అబార్షన్ చేసుకోమనడం కరెక్టా. నా బిడ్డను చంపేయాలని చూశారు. అది కరెక్టా అని రివర్స్‌లో అడుగుతుంది కావ్య.

ప్రతిసారి నన్ను బిడ్డను చంపుకో అంటుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. నువ్వు కడుపుతోనే ఉన్నావ్‌గా. నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావో చెప్పు. కవిగారు వచ్చి నీ బిడ్డ ప్రాణాన్ని చిదిమేయమంటావా అంటే చంపుకుంటావా చెప్పు అని కావ్య బాధగా అడుగుతుంది. పేగు బంధాన్ని తెంపులేక, తాళి బంధాన్ని తెంపుకుంటున్నాను. ఆయన ఇందుకు ఎలా చేస్తున్నారో చెప్పేవరకు నా నిర్ణయం మార్చుకోను అని...