Hyderabad, అక్టోబర్ 11 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య పుట్టింటికి వెళ్తుంది. ఏదైనా గొడవ జరిగిందా అని కనకం అడుగుతుంది. దాంతో తల్లిపై కావ్య అరుస్తుంది. పుట్టింటికి రావాలంటే నీ పర్మిషన్ అడిగి రావాలా. మొన్న టీవీలో ఎవరో అన్నారు అమ్మాయికి సొంతిల్లు లేదని. చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అని కావ్య అంటుంది.

కావ్య లోపలికి వెళ్తుంది. చూస్తుంటే అక్కడ గొడవ జరిగినట్లే ఉంది. కాల్ చేసి అడుగు అని కృష్ణమూర్తి అంటాడు. దాంతో కనకం కాల్ చేస్తుంటే వెనుక నుంచి వచ్చిన కావ్య ఫోన్ లాగేసుకుంటుంది. ఏంటిది అని కావ్య అడుగుతుంది. నువ్వు నిజం చెప్పట్లేదు. అందుకే చెప్పాల్సిన వాళ్లు చెబుతారని కనకం అంటుంది. ఏం జరగలేదని చెప్పాగా. ఆరాలు తీయడం ఆపేసి ముందు టిఫిన్ చేయమని ఫోన్ పట్టుకుని కావ్య లోపలికి వెళ్తుంది.

మరోవైపు కావ్య గురించి అపర్ణ ఇంట్లో గొడవ జరుగుతుంద...