భారతదేశం, ఏప్రిల్ 6 -- చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రతను ప్రోత్సహించడానికి, ద్విచక్ర వాహనదారులలో హెల్మెట్ వాడకాన్ని ప్రోత్సహించడానికి, చిత్తూరు జిల్లా పోలీసులు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ట్రాఫిక్ నియమాలను పాటించే వారికి బహుమతులు అందిస్తూ.. ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తారు.

'హెల్మెట్ పెట్టు- బహుమతి పట్టు' అనే పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రజలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం దీని లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుషార్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులు వీక్లీ, నెలవారీ లక్కీ డ్రాల ద్వారా నగదు బహుమతులు గెలుచుకునేందుకు అర్హులు. కాగా హెల...