భారతదేశం, నవంబర్ 3 -- కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల్లో మరోసారి సినీ దిగ్గజం మమ్ముట్టి తన సత్తా చాటాడు. కేరళ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజి చెర్రీన్ సోమవారం (నవంబర్ 3) ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడుగా మమ్ముట్టి నిలిచాడు. హారర్ మూవీ 'భ్రమయుగం'లో అతడు పోషించిన కోడుమోన్ పోట్టి పాత్రకుగాను ఈ సీనియర్ నటుడికి మరోసారి అగ్ర పురస్కారం దక్కింది.'ఫెమినిచి ఫాతిమా' చిత్రానికి గాను షమ్లా హంజాను ఉత్తమ నటిగా ప్రకటించారు. అలాగే 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా ఉత్తమ మలయాళ చిత్రంగా నిలిచింది.

మలయాళం ఇండస్ట్రీలో బెస్ట్ మూవీస్, యాక్టర్స్ కు ఇచ్చే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను సోమవారం (నవంబర్ 3) అనౌన్స్ చేశారు. త్రిస్సూర్‌లో జరిగిన ఒక విలేకరుల సమావేశంలో వీటిని ప్రకటించారు. ఇందులో మమ్ముట్టి మరోసారి అత్యుత్తమ గౌరవాన్ని దక్కించుకున్నాడు. ...