భారతదేశం, జూన్ 3 -- ఏపీలో మిగిలిన నగరాలతో పోలిస్తే విజయవాడలో అద్దెల భారం అధికంగా ఉంటుంది. దీనికి 2015లో హైదరాబాద్‌ నుంచి పాలనా వ్యవహారాలను ఏపీకి తరలించాలనే నిర్ణయంతో విజయవాడలో అద్దెల భారం మొదలైంది. అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్‌ఓడీల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు విజయవాడకు తరలి వచ్చారు. కుటుంబాలను వదిలి రాలేని వారికి ఇప్పటికీ ప్రభుత్వమే గెస్ట్‌ హౌస్‌ సదుపాయాలను కల్పించి మరీ పని చేయించుకుంటోంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వమే హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తోంది. వారి హోదా, ఉద్యోగాన్ని బట్టి అద్దె చెల్లింపు ఉంటోంది. ఆలిండియా సర్వీస్ అధికారులకు ప్రతి నెల రూ.40వేలకు పైగా అద్దె చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు క్యాడర్‌ను బట్టి సగటున రూ.10వేల నుంచి రూ.30వేల వరకు నివాస సదుపాయం కోసం ప్రభుత్వం నుంచి భత్యం లభిస్తుంది.

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ పరి...