భారతదేశం, ఆగస్టు 16 -- కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ తరహాలోనే మరో సంచలన సినిమా రాబోతుంది. బెంగాల్ విభజన తర్వాత జరిగిన హిందువుల ఊచకోత కథాంశంగా 'ది బెంగాల్ ఫైల్స్' సినిమా రాబోతోంది. ఇవాళ (ఆగస్టు 16) రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. డైరెక్ట్ యాక్షన్ డే సందర్భంగా శనివారం దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 'ది బెంగాల్ ఫైల్స్' ట్రైలర్ ను విడుదల చేశారు.

పశ్చిమ బెంగాల్ హింసాత్మక రాజకీయ గతం నేపథ్యంలో తెరకెక్కిన బెంగాల్ ఫైల్స్ విభజన అనంతరం జరిగిన హిందువుల ఊచకోతను వెలుగులోకి తెచ్చేలా ఉంది. బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ "యే పచ్చీమ్ బంగల్ హై, యాహా దో కాన్ స్టిట్యూషన్ చల్తా హై, ఏక్ హిందూవో కా, ఏక్ ముసల్మన్ కా (ఇది పశ్చిమ బెంగాల్, ఇక్కడ రెండు రాజ్యాంగాలు ఉన్నాయి- ఒకటి హిందువులకు, మరొకటి ముస్లింలకు) అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. "సిర్ఫ్ జమీన్ కా తుక్డా నహీ,...