భారతదేశం, జూన్ 4 -- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో.. మంగళవారం అర్థరాత్రి నుంచే కర్ణాటకవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇక బుధవారం ఆర్సీబీ టీమ్​ కప్​తో బెంగళూరుకు చేరుకోనుంది. విరాట్​ కోహ్లీ టీమ్​ మొత్తం విక్టరీ పరేడ్​ని నిర్వహించనుంది. ఈ ఆర్సీబీ విక్టరీ పరేడ్​కి వేలాది మంది ఫ్యాన్స్​ తరలి వస్తారని అంచనాలు ఉన్న నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టారు.

ఐపీఎల్​ 2025లో భాగంగా అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో చారిత్రాత్మక విజయం సాధించింది ఆర్సీబీ. ఇక బుధవారం విరాట్​ కోహ్లీ టీమ్​ బుధవారం నగరం నడిబొడ్డున విక్టరీ పరేడ్​ని నిర్వహించనుంది.

మధ్యాహ్నం 3.30 గంటలకు విధానసౌధ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సు పరేడ్.. చిన్నస్వామి స్టేడియంలో ముగుస్తుంది. సెంట్రల్ బిజినెస...