భారతదేశం, అక్టోబర్ 6 -- బెంగళూరు నగరంలో ఒక ఆటో డ్రైవర్‌కు, ప్రయాణికుడికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. సదరు ఆటో డ్రైవర్ తన ఆస్తులు, ఆదాయం గురించి చెప్పిన వివరాలు వింటే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మడం ఖాయం! తనకు రూ. 4-5 కోట్ల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు రూ. 2-3 లక్షల అద్దె ఆదాయం వస్తుందని, అంతేకాకుండా ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్‌లో పెట్టుబడి కూడా పెట్టానని ఆ డ్రైవర్ ప్రయాణికుడికి చెప్పాడు!

బెంగళూరువాసి అయిన ఆకాష్ ఆనందాని అనే వ్యక్తి ఈ విషయాన్ని 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకోగా, ఈ పోస్ట్ అనతికాలంలోనే లక్షలాది మందిని చేరి, పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఆకాష్ ఆనందాని తన అసలు పోస్ట్‌లో.. "బెంగళూరు క్రేజీగా ఉంది. ఆటో వాలా భయ్యాకు రూ. 4-5 కోట్ల విలువైన 2 ఇళ్లు ఉన్నాయట, ...