భారతదేశం, జూన్ 9 -- హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులకు, వాటి కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నవగ్రహాలలో శుభ గ్రహాలుగా భావించే బుధుడు, శుక్రుడు త్వరలోనే ఒకే రాశిలో జతకట్టబోతున్నారు. జ్యోతిష్య లెక్కల ప్రకారం నిన్ననే, అంటే జూన్ 8వ తేదీన కళలకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. మరో రెండు వారాల్లో, అంటే జూన్ 22వ తేదీన బుద్ధి కారకుడైన బుధుడు కూడా ఇదే రాశిలోకి రాబోతున్నాడు.

ఒకే రాశిలో ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల జ్యోతిష్య ప్రపంచంలో అత్యంత పవిత్రంగా భావించే 'లక్ష్మీనారాయణ యోగం' రూపుదిద్దుకోనుంది. ఈ అరుదైన రాజయోగం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఊహించని అదృష్టం వరించనుంది. ఆ రాశుల వివరాలు, వారు పొందబోయే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

బుధ, శుక్రుల అద్భుత కలయిక వృష...