భారతదేశం, ఆగస్టు 4 -- గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులను తీసుకువస్తుంది.

జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాలకు యువరాజుగా భావిస్తారు. బుధుడు వాక్చాతుర్యం, వ్యాపారం, కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు. పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ఆగస్టు 5న రాత్రి 7:58 గంటలకు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే సూర్యుడు, గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఈ మూడు గ్రహాల కలయిక ఏర్పడి త్రిగ్రాహి యోగానికి దారితీస్తుంది.

ఈ యోగం ఆగస్టు 17 వరకు ఉంటుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నంతకాలం ఈ యోగం కొనసాగుతుంది. ఈ 12 రోజులలో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం భ...