Hyderabad, ఆగస్టు 17 -- నవగ్రహాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు మార్పు చెందడంతో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. నవగ్రహాల్లో ముఖ్యమైన బుధ గ్రహం ఆగస్టు 30న సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది. బుధుడి రాశి మార్పు చెందడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. బుధుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుంది.

బుధుడు కమ్యూనికేషన్, తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. బుధుడు మంచి స్థానంలో సంచరించినప్పుడు శుభ ఫలితాలు ఎదురవుతాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 14 వరకు సింహరాశిలోనే బుధుడి సంచారం జరుగుతుంది.

దీంతో కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ప్రతి పనిలో విజయాన్ని అందుకుంటారు. పనులు కూడా సులభంగా పూర్తయిపోతాయి. మర...