భారతదేశం, సెప్టెంబర్ 28 -- భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి జమ్మూ కాశ్మీర్ వ్యక్తిగా ఆయన నిలిచారు. రోజర్ బిన్నీ రాజీనామా తర్వాత ఆయన నియామకం జరిగింది. మిథున్ మన్హాస్ ఐపీఎల్ లో ధోని టీమ్ సీఎస్కే మాజీ జట్టు సభ్యుడు. కానీ ఇండియా తరపున మాత్రం ప్రాతినిథ్యం వహించలేకపోయాడు.

బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న రోజర్ బిన్నీ అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకొన్నారు. అప్పటి నుంచి రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగారు. బీసీసీఐ కొత్త అధ్యక్షుడి కోసం మిథున్ మన్హాస్ ఒక్కడే నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆయన బీసీసీఐ పీఠాన్ని అధిరోహించడం ఖాయమైంది.

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్విట్టర్ (ప్రస్తుతం X)లో ఇలా పోస్ట్ చేశారు.. "ఇది ఒక గొప్ప సందర్భం! మిథున్ మన్హాస్ 'భారత క్రికెట్ న...