భారతదేశం, జనవరి 5 -- రక్తపోటు (High Blood Pressure) పెరగగానే వెంటనే మందులు వేసేసుకోవడం మనకు అలవాటు. కానీ, అసలు బీపీ పెరగడం అనేది ఒక వ్యాధి కాదని, అది మన శరీరంలో ఏదో లోపం ఉందని చెప్పే ఒక హెచ్చరిక మాత్రమేనని అంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జాక్ వోల్ఫ్సన్. అమెరికాలోని అరిజోనాకు చెందిన ఆయనకు కార్డియాలజీలో 16 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన పంచుకున్న విషయాలు ఇప్పుడు వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

"కేవలం రక్తపోటును అదుపులో ఉంచాలనే ఉద్దేశంతో మందులు వాడటం వల్ల గుండెపోటు, స్ట్రోక్ లేదా మరణాల ముప్పు తగ్గదు" అని డాక్టర్ వోల్ఫ్సన్ కుండబద్దలు కొట్టారు. బీపీ మందులు కేవలం రీడింగ్‌ను మాత్రమే తగ్గిస్తాయని, సమస్యకు కారణమైన మూలాలను అవి పరిష్కరించలేవని ఆయన అభిప్రాయపడ్డారు.

దీనిని అర్థం చేసుకోవడానికి ఆయన ఒక ఆసక్తిక...