భారతదేశం, జనవరి 20 -- దేశవ్యాప్తంగా రాజకీయ ఆసక్తి రేకెత్తిస్తూ.. బీజేపీ పగ్గాలను బిహార్‌కు చెందిన సీనియర్ నేత నితిన్ నబిన్ అందుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్థానంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నబిన్ నియమితులయ్యారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన.. మంగళవారం దిల్లీలో ఆ బాధ్యతలను స్వీకరించారు.

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా నితిన్​ నబిన్​ (46) నిలిచిపోయారు.

భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. నబిన్‌ను ఒక 'మిలీనియల్' నాయకుడిగా అభివర్ణించారు. భారతదేశం ఆర్థికంగా, సాంకేతికంగా మారుతున్న తీరును దగ్గరుండి చూసిన తరం చేతుల్లోకి పార్టీ ...