భారతదేశం, జూలై 4 -- భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంస్థాగతంగా భారీ మార్పులకు సిద్ధమవుతోంది! ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక యూనిట్ల అధ్యక్షుల నియామకం పూర్తయిన తర్వాత, ఇప్పుడు పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడి నియామకంపై బీజేపీ దృష్టి సారించింది.

2020 నుంచి జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం 2023లో ముగిసినప్పటికీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు దానిని 2024 వరకు పొడిగించారు. ఈ కీలక పదవిని ఎవరు చేపడతారనే సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతున్నప్పటికీ, పార్టీకి తొలిసారిగా మహిళా అధ్యక్షురాలు ఎంపికయ్యే అవకాశం ఉందని లైవ్ హిందుస్థాన్‌కు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, అధ్యక్ష రేసులో ఏపీ కీలక నేత పురంధేశ్వరి సహా పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, 20...