భారతదేశం, ఆగస్టు 11 -- నేటి బిజీ లైఫ్‌లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి శ్రీమద్భగవద్గీత ఎలా మార్గదర్శకం చేస్తుందో తెలుసుకోండి. ఇంద్రియ నిగ్రహం, ఆత్మసంయమనం ద్వారా అశాంతిని దూరం చేసుకునే మార్గాలు.

నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళన ప్రతి ఒక్కరిని నీడలా వెంటాడుతున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఆఫీస్ టెన్షన్లు, భవిష్యత్తు గురించిన బెంగ, కుటుంబ బాధ్యతల ఒత్తిడి మనిషిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఈ బిజీ వాతావరణంలో చాలా మంది ప్రశాంతతను కోల్పోయి సతమతమవుతున్నారు. ఇలాంటి అశాంతి సమయాల్లోనే వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీత సర్వరోగ నివారణిలా పనిచేస్తుంది. గీతలోని ప్రతి శ్లోకం నేటి ఆధునిక మానవుడి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.

శ్రీమద్భగవద్గీతలోని రెండవ అధ్యాయం 64వ శ్లోక...