భారతదేశం, సెప్టెంబర్ 28 -- బిగ్ బాస్ 9 తెలుగును మరిం ఇంట్రెస్టింగ్ మార్చేందుకు ఓ కామనర్ ను వైల్డ్ కార్డు ఎంట్రీగా పంపించారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ సంజన గల్రానీతో డ్రామా ప్లే చేశారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ తో సంజనను సీక్రెట్ రూమ్ లో ఉంచి, ఆ తర్వాత స్టేజీ మీదకు పిలిచి, హౌస్ మేట్స్ త్యాగాలతో తిరిగి ఇంట్లోకే పంపే స్కెచ్ వేశారు. ఇప్పుడు సంజన గల్రానీ పేరు వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 9 తెలుగులో సంజన గల్రానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారింది. ఈ బుజ్జిగాడు మూవీ హీరోయిన్ తన పాయింట్ ను గట్టిగా చెప్తూ, ఆటను రసవత్తరంగా మారుస్తోంది. తెలుగులో సోగ్గాడు, బుజ్జిగాడు, సమర్థుడు, పోలీస్ పోలీస్, దుశ్వాసన, ముగ్గురు, యమహో యమ, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్, 2 కంట్రీస్ తదితర సినిమాలు చేసింది సంజన.

బిగ్ బాస్ 9 తెలుగుతో మరింత పాపులర్ అవుతున్న సంజన గల్రానీ చెల్లి ...