Hyderabad, సెప్టెంబర్ 16 -- బిగ్ బాస్ 9 తెలుగు తొలి వారం ముగిసి రెండో వారంలోకి ఎంటరైంది. ఇప్పటికే కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఈసారి సాధారణ వ్యక్తులు కూడా హౌస్ లోకి వెళ్లడంతో వాళ్ల రెమ్యునరేషన్లపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈసారి అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్ గా టీవీ స్టార్ భరణి నిలిచాడు.

బిగ్ బాస్ 9 తెలుగులో ఈసారి పెద్దగా పేరున్న వాళ్లు రాలేదు. దీంతో గత సీజన్ కంటే ఈసారి మరింత దారుణంగా షో ఫ్లాపవుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆడియెన్స్ ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే ఉన్న వాళ్లలోనూ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ విషయానికి వస్తే అతని పేరు భరణి శంకర్. అ

తడు వారానికి రూ.4 లక్షలు అందుకుంటున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. భరణికి పర్సనల్ లైఫ్, రిలేషన్‌షిప్స్ విషయ...