భారతదేశం, సెప్టెంబర్ 19 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుంచి మరొకరు ఎలిమినేట్ అయేందుకు టైమ్ దగ్గరపడుతోంది. సెకండ్ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారాన్నది సస్పెన్స్ గా మారింది. ఓటింగ్ తారుమారు అవుతుండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. మరి బిగ్ బాస్ 9 తెలుగు సెకండ్ వీక్ లో నామినేషన్లలో ఎవరున్నారు? వాళ్లకు ఓటింగ్ ఎలా ఉందో? ఓ సారి చూసేద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్లలో ఏడుగురు ఉన్నారు. ఇందులో ముగ్గురు సెలబ్రిటీలు, నలుగురు కామనర్లు. సెలబ్రిటీల్లో సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైనీ నామినేషన్లలో ఉన్నారు. కామనర్స్ నుంచి డీమాన్ పవన్, హరిత హరీష్, మర్యాద మనీష్, ప్రియ శెట్టి నామినేషన్లో ఉన్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు రెండో వారం ఓటింగ్ అనూహ్యంగా మారిపోతుంది. నామినేషన్లలో ఉన్న వాళ్ల స్థానాలు కిందకు, మీదకు మారుతున్నాయి. ఇవాళ (సెప్టెంబర్ 19) ఉదయం 10 గంటల వరక...