భారతదేశం, సెప్టెంబర్ 24 -- బిగ్ బాస్ 9 తెలుగు మూడో వీక్ కు చేరుకుంది. ఈ సీజన్ మూడో వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే టాక్ ఆసక్తి రేపుతోంది. అయితే ఈ వీక్ రీతూకు షాక్ తప్పేలా లేదు. టాప్ కంటెండర్ అనుకున్న ఆమె ఈ వారం ఎలిమినేట్ అవుతుందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ 9 తెలుగు మూడో వారం నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. రాము రాథోడ్, ఫ్లోరా సైని, హరిత హరీష్, కల్యాణ్ పడాల, రీతు చౌదరీ, ప్రియా శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో రీతు చౌదరీ కూడా ఉంటుందని అంటున్నారు.

బిగ్ బాస్ 9 తెలుగులో ఫస్ట్ రెండు వారాల్లోనూ ఫ్లోరా సైని నామినేషన్లలో ఉంది. లాస్ట్ వరకూ వెళ్లింది. ఎలిమినేట్ అవుతుందేమో అ...