భారతదేశం, సెప్టెంబర్ 23 -- బిగ్ బాస్ 9 తెలుగులో బిగ్ ట్విస్ట్ రాబోతోంది. ఈ పాపులర్ రియాలిటీ షోను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వారమే వైల్డ్ కార్డు ఎంట్రీలను ప్రవేశపెడుతున్నారని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. ఫస్ట్ బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలుగా కామనర్స్ వస్తారని సమాచారం.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఈ షో మూడో వారానికి చేరుకుంది. తొలి రెండు వారాల్లో వరుసగా శ్రష్టి వర్మ, మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు థర్డ్ వీక్ నడుస్తోంది. ఈ మిడ్ వీక్ లోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందని తెలిసింది. అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన ముగ్గురు కామనర్స్ ను ఈ రోజు అర్ధరాత్రి హౌస్ లోకి పంపుతారని సమాచారం. అయితే దీనిపై అ...