భారతదేశం, సెప్టెంబర్ 27 -- రసవత్తరంగా సాగుతున్న బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబ్ వేశాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ లో ఎక్కువ శాతం మంది సంజన గల్రానీని బయటకు పంపించడానికి ఓటు వేశారు. దీంతో ఆమెను తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో పెట్టారు. కానీ ఇవాళ (సెప్టెంబర్ 27) ఎపిసోడ్ లో మాత్రం ఆమెను ఎలిమినేట్ చేసి, బయటకు పంపిస్తున్నట్లు చూపించబోతున్నారు. తాజా ప్రోమోలో స్టేజ్ పై సంజన ఫైర్ అయింది.

బిగ్ బాస్ రియాలిటీ షోలో ఎలిమినేట్ అయినవాళ్లను స్టేజీపైకి పిలిచి సెండాఫ్ ఇవ్వడం తెలిసిందే. సంజనను కూడా అలాగే పిలిచారు. ''నేను ఎలిమినేట్ అవ్వడానికి అంత చెడ్డపనులేమీ చేయలేదు కదా'' అని సంజన అడుగుతుంది. ప్రతిసారి దొంగతనం చేస్తే చిరాకొస్తుందని హోస్ట్ నాగార్జున అంటాడు.

ఇక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లోని హౌస్ మేట్స్ ఒ...