భారతదేశం, సెప్టెంబర్ 9 -- బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఓనర్స్, టెనెంట్స్ మధ్య పోరు జోరు అందుకుంది. నామినేషన్స్ లో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ రోజు సెలబ్రిటీ ఇమ్మాన్యుయేల్, కామనర్ మాస్క్ మ్యాన్ హరీష్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. రెండో రోజు టెనెంట్స్ గ్రూప్ లోని సంజన గల్రానీని ఓనర్లు టార్గెట్ చేశారు. సెకండ్ డే ఫస్ట్ ప్రోమోలో ఇది క్లారిటీగా కనిపించింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫస్ట్ నామినేషన్స్ స్టార్ట్ అయింది. నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్లు ఫైర్ మీద ఉంటారు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఇప్పటికే కామనర్స్ కలిసి ఓనర్లుగా, సెలబ్రిటీలు కలిసి టెనెంట్స్ గా రెండు గ్రూపులుగా ఉన్నారు. ఇక ఈ సారి గ్రూప్ ల మధ్య పోరు ఏ లెవల్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకు తగ్గట్లుగానే సెకండ్ డే ప్రోమో 1ను వదిలారు మేకర్స్.

బిగ్ బ...