భారతదేశం, సెప్టెంబర్ 10 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో హౌస్ లో వాతావరణం వేడెక్కింది. నామినేషన్స్ ప్రక్రియ కారణంగా వార్ మొదలైంది. కంటెస్టెంట్లు ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకోవడం, పరస్పరం ఆరోపణలు, వాగ్వాదంతో షో ఇప్పుడే రసవత్తరంగా మారింది. మరి బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్ లో ఎవరున్నారు? ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ఎవరు నామినేట్ అయ్యారో చూసేద్దాం.

ముందుగా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇవాళ (సెప్టెంబర్ 10) రిలీజ్ చేసిన ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రోమోలో సంజన, తనూజపై ఫైర్ అయింది దమ్ము శ్రీజ. టాస్క్ లో నెగ్గిన భరణి హ్యామర్ తెచ్చి శ్రీజ చేతికిచ్చాడు. అప్పుడు వాష్ రూమ్ ఇన్సిడెంట్ ను తీసుకొచ్చి సంజన గురించి మాట్లాడుతుంది శ్రీజ. అలా పెట్టడం మాకు ప్రాబ్లం అన్నా కూడా లేదు అలానే ఉంటా, అదే స్టాండ్ మీద ఉంటా అన్నారు. ఆ స్టాండే...