Hyderabad, సెప్టెంబర్ 14 -- బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ మొదటి వారం సక్సెస్‌ఫుల్‌గా పూర్తి అయిపోయింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగులోకి కంటెస్టెంట్స్‌గా మొత్తం 15 మంది అడుగుపెట్టారు. వారిలో కామనర్స్‌గా మనీష్, హరీష్, శ్రీజ దమ్ము, ప్రియా, సోల్జర్ కల్యాణ్, డీమోన్ పవన్ ఆరుగురు అగ్ని పరీక్ష ద్వారా ఎంటర్ అయ్యారు.

ఇక సెలబ్రిటీ కేటగిరిలో రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రేష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి తొమ్మిది మంది కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. ఇక వీరికి మొదటి వారం బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్ నిర్వహించారు.

బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో రాము రాథోడ్, రీతూ చౌదరి, ఇమ్మాన్యుయెల్, తనూజ గౌడ, సుమన్ శెట్టి, సంజన, ఫ్లోరా సైని, శ్రేష్టి వర్మ, డిమోన్ పవన్ 9 మంది ఉన్నారు. వీర...