భారతదేశం, అక్టోబర్ 11 -- బిగ్ బాస్ 9 తెలుగులో ఊహించని ట్విస్ట్ జరగబోతుందని తెలిసింది. బిగ్ బాస్ ఈ సీజన్ అయిదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఫస్ట్ నుంచే టాక్ వినిపిస్తోంది. ఇందులో నుంచి ఫ్లోరా సైనీ ఎలిమినేట్ కావడం పక్కా అని అంటున్నారు. ఆమె కాకుండా మరో ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వైల్డ్ కార్డ్స్ చేస్తారనేది సంచలనంగా మారింది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లోకి ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావడం దాదాపుగా ఖాయమైంది. బిగ్ బాస్ అయిదో వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారన్నది కూడా నిజమేననే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ వారం ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్ మినహా అందరూ ఎలిమినేషన్లో ఉన్నారు. భరణి, సుమన్ శెట్టి, తనుజ, రీతు చౌదరి, డీమాన్ పవన్, కల్యాణ్, ఫ్లోరా సైనీ, సంజన, శ్రీజ దమ్ము, దివ్య నిఖిత నామినేషన్లలో ఉన్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ అయిదో వార...