భారతదేశం, ఆగస్టు 17 -- బిగ్​బాస్​ ఓటీటీ సీజన్​ 2 విన్నర్​, వివాదాస్పద యూట్యూబర్​ ఎల్విష్​ యాదవ్​ ఇంటిపై కాల్పుల మోత మోగింది! హరియాణా గురుగ్రామ్​లోని అతని ఇంటిపై ముగ్గురు దుండగులు, ముసుగు వేసుకుని, కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని, చాలా రౌండ్ల బుల్లెట్లు పేల్చారని పోలీసులు వెల్లడించారు.

ఈ సంఘటన సెక్టార్ 57లో తెల్లవారుజామున సుమారు 5.30 గంటల సమయంలో జరిగింది. "పదుల సంఖ్యలో రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ తన ఇంట్లో లేరు," అని గురుగ్రామ్ పోలీస్ పీఆర్ఓ సందీప్ కుమార్ మీడియాతో చెప్పారు.

ప్రస్తుతం ఎల్విష్ యాదవ్ హరియాణా బయట ఉన్నారు. కాల్పుల వల్ల పగిలిన అద్దాలు, దెబ్బతిన్న పైకప్పు, ఇతర ఆనవాళ్లకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఎల్విష్ యాదవ్ ఆ భవనంలోని రెండొవ, ...