Hyderabad, ఆగస్టు 26 -- ఇండియన్ సినిమాను బాహుబలికి ముందు, తర్వాత అనే స్థాయిలో రాజమౌళి ఆ రెండు భాగాలను తీర్చిదిద్దాడు. అలాంటిది ఆ రెండు సినిమాలు కలిపి ఒకే మూవీగా ఇప్పుడు వస్తుందంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. బాహుబలి: ది ఎపిక్ పేరుతో ఈ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే చెప్పగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

రాజమౌళి ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. అందరూ పాత సినిమాలను రీరిలీజ్ చేస్తుంటే.. అతడు మాత్రం తన బాహుబలి రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా తీసుకొస్తూ ఆసక్తి రేపుతున్నాడు. అంతేకాదు ఆ రెండు సినిమాల్లోని అద్భుతమైన విజువల్స్ ను ఇప్పుడు ఒకే టీజర్లో ఆసక్తికరంగా కట్ చేసి రిలీజ్ చేశారు.

ఒక నిమిషం 18 సెకన్ల నిడివి ఉన్న టీజర్ ను మంగళవారం (ఆగస్టు 26) మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అసలు ఎలాంటి డైలాగులు ల...