Hyderabad, అక్టోబర్ 7 -- ప్రభాస్ అంటే బాహుబలి.. బాహుబలి అంటే ప్రభాస్ అనేంతలా ఆ సినిమాకు రెబల్ స్టార్ అంతలా సెట్ అయ్యాడు. కానీ ఆ మూవీకి అసలు మొదటగా అతన్ని అనుకోలేదన్న వార్తలు వైరల్ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి: ది ఎపిక్' (ఇది 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' కలిపి) గురించి అనౌన్స్ చేసినప్పటి నుండి ఈ సినిమా రన్ టైమ్ తోపాటు మరో చర్చ కూడా జరిగింది.

అది హృతిక్ రోషన్ ను ఒకప్పుడు ఆ ప్రభాస్ పాత్ర కోసం సంప్రదించారనే వార్తలు. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తాజాగా ఆర్కా మీడియా వర్క్స్ నిర్మాత శోభు యార్లగడ్డ 'గుల్టే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీటన్నింటిపై స్పష్టత ఇచ్చాడు.

'బాహుబలి: ది ఎపిక్' ప్రకటన తర్వాత ప్రభాస్ పాత్ర కోసం మొదట హృతిక్ రోషన్‌ను సంప్రదించారని ఆన్‌లైన్‌లో విపరీతమైన చర్చ జరిగింది....