Hyderabad, జూలై 17 -- ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలై పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి కలిసి ఈ మైలురాయిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, అధికారిక 'బాహుబలి' ఖాతా "కట్టప్ప బాహుబలిని చంపకపోతే?" అని ప్రశ్నించగా.. రానా తన భల్లాలదేవ పాత్రను అనుకరిస్తూ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు, ప్రభాస్ కూడా దానికి సరదాగా బదులిచ్చాడు.

బాహుబలిలో ప్రభాస్, రానా హోరాహోరీ పోరు అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ ఇద్దరి భారీ పర్సనాలిటీలు, వాళ్ల నటన దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకునేలా చేసింది. ఇప్పుడీ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ లో సరదాగా తలపడ్డారు. బుధవారం(జులై 16) రానా ఇన్‌స్టాగ్రామ్‌లో "కట్టప్ప బాహుబలిని చంపకపోతే?" అనే పోస్ట్‌ను షేర్ చేస్తూ.. "నేనే చంపేసేవాడిని! (కోపంగా ఉన్న ముఖం, ...