భారతదేశం, జనవరి 20 -- బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ఆయన భార్య, రచయిత్రి, మాజీ నటి ట్వింకిల్ ఖన్నా సోమవారం (జనవరి 19) సాయంత్రం విదేశీ పర్యటన ముగించుకుని ముంబయిలోని ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ఎస్ యూవీ కారు, సెక్యూరిటీ కారు ప్రమాదానికి గురయ్యాయి. హిందుస్థాన్ టైమ్స్ ప్రత్యేక నివేదిక ప్రకారం, జుహులోని వారి ఇంటికి విమానాశ్రయం నుండి వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

ప్రత్యక్ష సాక్షులు ఇది వింత ప్రమాదంగా పేర్కొన్నారు. స్థానిక నివేదికల ప్రకారం వేగంగా వస్తున్న మెర్సిడెస్ కారు ఆటో రిక్షాను ఢీ కొట్టింది. ఆ ఆటో రిక్షా అక్షయ్ కుమార్ సెక్యూరిటీ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఆ కారు వెళ్లి అక్షయ్, ట్వింకిల్ ఉన్న ఎస్ యూవీని ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ, ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని, ఆటో డ్ర...